ప్రభుత్వంలోని కొంతమంది కక్ష సాధింపుతో తనను టార్గెట్ చేశారని తన బిజినెస్ ను దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యంగా కనబడుతోందని టీడీపీ మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి ఆరోపించారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…
తనకు చెందిన లారీలను బస్సులను నిలిపివేయడం వెనుక ప్రధాన లక్ష్యం దెబ్బ తీయాలన్న ఉద్దేశమేనన్నారు… ఎలాంటి బెధిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వ్యాపారాలన్నీ పోయినా వ్యవసాయం చేస్తూనే తమ కుటుంబం జవించగలదని తెలిపారు దివాకర్ రెడ్డి…
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ది గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.. వైసీపీలో చేరితే ఒక విధంగా లేదంటే మరోక విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు…
—