జగన్ కు బీజేపీ క్లారిటీ…

జగన్ కు బీజేపీ క్లారిటీ...

0
80

ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు… తాజాగా ఆయన పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ది చెందాలని అన్నారు…

రాయలసీమ రతనాల సీమగా మారాలనేది కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు… అందుకోసం కేంద్రప్రభుత్వం తరపున తాము ఏపీ సర్కార్ కు అండగా ఉంటామని అన్నారు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాటు సినిమా చూపించి ఇప్పుడు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని అన్నారు…

చంద్రబాబు నాయుడు 640 కోట్లు వెచ్చించి వర్షం వస్తే లీకయ్యే నిర్మాణాలు చేశారని ద్వజమెత్తారు… హైదరాబాద్ వల్లే ఏపీకి నష్టం వచ్చిందని అన్నారు… ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదని అన్నారు…