జగన్ కు బీజేపీ సహకారం

జగన్ కు బీజేపీ సహకారం

0
81

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే… వికేంద్రీకరణ దిశగా రానున్న రోజుల్లో ఏపీలో మూడు రాజధానులుగా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు… అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ రావచ్చు, విశాఖ పట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూల్ జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు…

దీనిపై బీజేపీ నేత విష్ణువర్దర్ రెడ్డి స్పందించారు… తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీకేంద్రీకరణ చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు…

మూడు ప్రాంతాల అభివృద్ది చేయడానికి జగన్ చెప్పిన అజెండాను మాటలతో కాకుండా చేతుల్లో చూపిస్తే కనుక తమ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తుందని అన్నారు… అంతేకాదు అమరావతిలో 10 వేల ఎకరాల్లో సీడ్ క్యాపిటల్ కు ఏర్పాటు చేయాలని అన్నారు…