బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగబడ్డారని ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు… బీసీజీ వికీపీడియా ప్రొఫైల్ ను ఎడిట్ చేయించి సిఎం జగన్ మోహన్ రెడ్డికి 50% వాటాలున్నాయని రాయించారని ఆరోపించారు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయట పెట్టిందని తెలిపారు అందుకే పాతాళానికి జారిపోయావు బాబూ అని అన్నారు విజయసాయి రెడ్డి
అలాగే దళితులన్నా, బలహీన వర్గాల వారన్నా చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ చిన్న చూపే అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించారని గుర్తు చేశారు.. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ ను దూషించడం చూస్తే అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి పరివర్తన రాలేదని తెలుస్తోందని అన్నారు.
మూడు రాజధానులు వద్దని వాదిస్తున్న వారిలో, రాష్ట్రానికి జరిగే మేలుకన్నా చంద్రబాబుకు సేవలో తరించాలనే తాపత్రయం కనిపిస్తోందని అన్నారు.. రాజకీయాల్లో పైసకు కొరగాని వారూ రంకెలేస్తున్నారని బాబుకు భజన చేయాలనుకుంటే అభ్యంతరం లేదు కాని అవగాహన లేకుండా మాట్లాడొద్దని అన్నారు.