తెలంగాణలో సముద్రం లేదు కాని ఏపీకి సముద్రం ఉంది… ఇదే పెద్ద వరం. అయితే ఏపీలో అనేక నిక్షేపాలు ఉన్నాయి, వనరులు చాలా ఉన్నాయి, ఇవే ఏపీకి పెద్ద ఆస్తి అని చెప్పాలి. ముఖ్యంగా సముద్రతీరం వల్ల ఎగుమతులు దిగుమతులు చిన్న పరిశ్రము అలాగే గ్యాస్ నిక్షేపాలు ఇలా చాలా లాభాలు ఏపీకి కలిసి వచ్చాయి. అందుకే ఏపీ రిచెస్ట్ స్టేట్ గా సౌత్ లో ఉంటుంది.
తాజాగా ఏపీకి ఉజ్వల భవిష్యత్ ఉందని అంటున్నారు కేంద్ర పెట్రోలియ సహజ వనరులు స్టీల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తాజాగా ఏపీ సీఎం జగన్ తో అమరావతిలో భేటి అయ్యారు. ఈ మేరకు ఏపీకి రాబోయే రోజుల్లో పెట్టుబడుల వరద ఖాయమని ప్రకటన చేశారు. దాదాపు రాబోయే 5 సంవత్సరాలలో 2 లక్షల కోట్ల పెట్టుబుడులు వస్తాయి అని ఆయన తెలియచేశారు. ఇక్కడ పెట్రోలియం బడా కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబుడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్రమంత్రి చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ కేంద్రమంత్రి తో కలిసి పలు విషయాలు చర్చించారు పలు నిధులు నష్టపరిహరాల గురించి కేంద్రమంత్రితో చర్చించి వాటిని విడుదల చేయాలని కోరిన విషయం తెలిసిందే.