జగన్ కు ఆ దమ్ముందా….

జగన్ కు ఆ దమ్ముందా....

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు…

జగన్ కు ఎన్నికల్లో వెళ్లె దమ్ముందా అని ప్రశ్నించారు.. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మూడు రాజధానులు అమలు చేసేముందు అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తులిసి రెడ్డి..

గత టీడీపీ సర్కార్ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా వంచించిందని ఆరోపించారు… ప్రజలను కన్న తండ్రిలా కాపాడాల్సిన జగన్ మోహన్ రెడ్డి కసాయిలా మారాడని ఆరోపించారు తులసి రెడ్డి… రాజధాని రైతుల భూములు తిరిగి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు…