జగన్ కు పవన్ కల్యాణ్ పంచ్

జగన్ కు పవన్ కల్యాణ్ పంచ్

0
80

పవన్ కల్యాణ్ రాయలసీమ టూర్ మొత్తానికి అధికార పార్టీపై విమర్శలతోనే నడుస్తోంది కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఇలా ఎక్కడ చూసినా పవన్ అధికార పార్టీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. తాజాగా బీజేపీతో చెలిమి గురించి కూడా కొన్ని కామెంట్లు చేశారు.. అంతేకాదు దిశ నిందితులకు ఉరిశిక్ష గురించి కామెంట్లు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు.

తాజాగా టమాట రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతులకు తెలియచేశారు.. జగన్ రెడ్డి టమాట రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతతో పాటు కాంట్రాక్టుల రద్దుపై ఇన్ని రోజులు జగన్ ఆలోచించారని. ఏపీ ప్రజల సమస్యలు ఏమీ పట్టించుకోవడం లేదని జగన్ ని సూటిగా ప్రశ్నించారు పవన్.

రైతులకు జగన్ ఏం సాయం చేశారు, రైతులకు కోపం వస్తే మీమ్మల్ని కూడా పొలం పని చేయిస్తారు అని పవన్ విమర్శించారు. ప్రజలకు సరైన పాలన అందించండి, కేసులపై ఫోకస్ కాదు ముందు పాలన సరిగ్గా చేయండి అని విమర్శించారు…ఇంగ్లీష్ మీడియం కాదని.. ముందు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం తాను ముందు ఉంటానని రైతుల కోసం వస్తే తనని అడ్డుకోవడానికి ప్రయత్నించారు అని ఆయన తీవ్రస్దాయిలో ఆరోపించారు.