జగన్ కు పవన్ కొత్త డిమాండ్….

జగన్ కు పవన్ కొత్త డిమాండ్....

0
90

నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు… దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు…

రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాలకోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని అన్నారు… ఇల్లులేని పేదలకు స్థలాన్ని కేటాయించడాన్ని ఎవరు తప్పుబట్టరని అన్నారు…

చిత్త శుద్ది ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూమిని వారికి ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు… ఒక వైపు రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లే అవుతుందని ఆరోపించారు… ఇలా చేసి ప్రభుత్వం చేతులు దులుపు కోవాలని చూస్తోందిని ఆరోపించారు…