జగన్ కు రామానాయుడు రెండు సూటి ప్రశ్నలు

జగన్ కు రామానాయుడు రెండు సూటి ప్రశ్నలు

0
89

తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవిచూసింది.. అలాగే చాలా మంది సీనియర్లు ఓటమి పాలయ్యారు.. దీంతో వారు సెగ్మెంట్ రాజకీయాలకు పరిమితం అయ్యారు.. కాని గెలిచిన ఎమ్మెల్యేలలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, అలాగే నిమ్మలరామానాయుడు చంద్రబాబు వెంట ఉంటున్నారు.. ప్రతీ విషయంలో బాబు తరపున మాట్లాడుతున్నారు.

తెలుగుదేశం గొంతు వినిపిస్తున్నారు.. తాజాగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలక కామెంట్లు చేశారు సీఎం జగన్ పై, ఏపీ రాజధాని విషయంలో జగన్ ప్రజలను అయోమయంలో పడేశారని, ఐదేళ్లు అమరావతిలో చక్కని పాలన జరిగిందని.. కాని జగన్ ప్రకటనతో రాజధానిలో అలాగే ఏపీలో ప్రాంతీయ విభేదాలు సృష్టించారని విమర్శించారు.

మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే జగన్ మాట తప్పారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంపై జగనే సమాధానం చెప్పాలని అన్నారు.అయితే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గిరి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనుండటంతో తాజాగా ఈ కామెంట్లు చేశారు ఆయన.