జగన్ కు సవాల్ విసిరిన ఆదినారాయణ రెడ్డి

జగన్ కు సవాల్ విసిరిన ఆదినారాయణ రెడ్డి

0
89

మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది, అయితే దీనిపై పలువురిని ప్రశ్నిస్తూనే ఉంది సిట్, విచారణ కోసం పలువురు వైసీపీ నేతలను అలాగే టీడీపీ నేతలను కూడా సిట్ పిలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరుకావాలి అని చెప్పింది.

ఈ కేసుతో నాకు కొంచెం సంబంధం ఉందని తేలినా బహిరంగంగా ఉరేసుకుంటానని తెలిపారు ఆదినారాయణ రెడ్డి. అయితే వైయస్ జగన్ కుటుంబ పాత్ర ఉందని తేలితే ఎం చేస్తారో చెప్పాలి అని సవాల్ విసిరారు మాజీ మంత్రిఆది నారాయణ రెడ్డి . అయితే ఈ విషయం లో సిట్ ఫై ఎవరికీ నమ్మకం లేదని కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సిబిఐ కి ఈ కేసు ని అప్పగించాల్సింది గా డిమాండ్ చేసారు.

మొత్తానికి ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.. అయితే దీనిపై త్వరలోనే నిందితులని పట్టుకుంటాము అని విచారణ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది అని చెబుతున్నారు సభ్యులు, మరో పక్క వైయస్ కుటీంబీకులను కూడా విచారిస్తున్నారు. ఎవరి పాత్ర ప్రమేయం ఉన్నా వారిని వదిలిపెట్టేది లేదు అంటున్నారు ప్రభుత్వ పెద్దలు.