జగన్ కు షాక్ వైసీపీకి కీలక నేత గుడ్ బై

జగన్ కు షాక్ వైసీపీకి కీలక నేత గుడ్ బై

0
82

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది…. ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు… కొద్దికాలంగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ముద్దన తిరుపతి నాయుడు తాజాగా పార్టీకి రాజీనామా చేశారు…

తన రాజీనామా లేఖను మంత్రి బాలినేని శ్రీనివాస రావుకు అందించారు… కాగా ముద్దన తిరుపతి నాయుడు డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఆశించారు… కానీ ఆ పదవిని రామనాథంకు అప్పగించారు జగన్ మోహన్ రెడ్డి… దీంతో ఆయన అలక చెందిరు… ఈ విషయాన్ని తన అనుచరుల దగ్గర చెప్పి బాధపడ్డారు…

పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీకోసం కష్టపడిన వారికి ప్రాధాన్య ఇవ్వకున్నారని ముద్దన ఆవేదన చెందారు… అందుకే తాను వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు… తాను ఏ పార్టీలో చేరాలో అనే దానిపై అనుచరులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు…