జగన్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన స్సెషల్ సంస్థ…

జగన్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన స్సెషల్ సంస్థ...

0
93

తెలంగాణతో పాటు ఏపీలో కూడా కరోనా వైరస్ కొరలను చాచుతోంది… ఈ మయదారి మహమ్మారి ఎక్కడ ఏమూలన నుంచి వస్తుందోనని భయపడుతున్నారు… ఇటీవలే ఢిల్లీ హైదరాబాద్ వంటి మెట్రో సిటీలల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ ద్వారా కరోనా సోకడంతో అందరిని భయాందోళనకు గురిచేసింది…

కరోనా పై అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది… దీంతో సర్కార్ డెలివరీని నిలిపివేసింది తాము ప్రకటించేవరకు ఫుడ్ డెలివరీ చెయకూడని జూమాటో స్విగ్గీ సంస్థలకు తెలిపింది…

అయితే ఏపీలో మాత్రం కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతిని ఇచ్చింది… దీంతో ఏపీ సీఎం కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాయి జూమాటో స్విగ్గీలు… కష్ట సమయంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన సీఎం జగన్ కు థ్యాక్స్ అని చెప్పారు…