జగన్ కు బీజేపీ డిమాండ్స్

జగన్ కు బీజేపీ డిమాండ్స్

0
87

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డి తాజాగా శాసనసభలో ప్రకటించారు… దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి… జగన్ పాలన చూస్తుంటే తుగ్లక్ పాలనలా ఉందని రాజధాని విషయంలో ప్రజలకు అంతుచిక్కడంలేదని చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు…

ఉన్న ఒక్క రాజధానికే దిక్కులేదని అనుకుంటే మూడు రాజధానులు ప్రకటిస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ ప్రశ్నించారు… ఇక ఇదేక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ నిర్ణయంపై స్పందిచారు… అభివృద్ది వికేంద్రీకరణ చేయాలి కానీ పరపాలన వికేంద్రీకరణ చేయకూడని అన్నారు…

అమరావతి సీడ్ క్యాపిటల్లో పూర్తి శాసన,పరిపాలన వ్యవస్థ &హైకోర్టుబెంచ్, విశాఖ ఆర్ధికరాజధానిగా ఎదగడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు,క ర్నూలులో హైకోర్టు ఏర్పాటు ద్వారా అభివృద్ధివికేంద్రీకరణ చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు..