టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం అని అన్నారు టీడీపీ రాష్ట్ర ప్రాధాన కార్యదర్శి నారాలోకేశ్… ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.. అయ్యన్న పాత్రుడిది 10 శాఖలకు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం అని తెలిపారు… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిపి 10 మంది ముఖ్యమంత్రులను చూసిన అనుభవం అయ్యన్నదని తెలిపారు లోకేశ్. అలాగే ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన సీనియర్ నేత అయ్యన్న పాత్రుడని తెలిపారు…
అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ జగన్ ప్రభుత్వం 7 కేసులు పెట్టిందని ఆరోపించారు… జగన్ పాలన ఎలా ఉంది అంటే ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే చాలు అర్ధం అవుతుందని లోకేశ్ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి కుర్రకుంకలను అయ్యన్న పాత్రుడు
చాలా మందినే చూసి ఉంటారని తెలిపారు