జగన్ లండన్ టూర్ వాయిదాకి కారణం ఇదే

జగన్ లండన్ టూర్ వాయిదాకి కారణం ఇదే

0
63

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు కుటుంబంతో కలిసి ఫారెన్ టూర్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు.. పది రోజుల పాటు లండన్ లో ఆయన టూర్ వేయాలి అని భావించారు…ఇప్పటికే కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు ..లండన్ లో జగన్ కుమార్తె చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబంతోపాటు వెళ్లాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలకు సమయం ఉండటంతో టూర్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. కాని కొన్ని కారణాల వల్ల ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు అని తెలుస్తోంది.

ఇక ఫలితాలకు ఎంతో సమయం లేదు అయితే ఈ సమయంలో టూర్ ఎందుకు అని జగన్ ఆగారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఓపక్క తుఫాను ఉంటే, ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనలు, సినిమాలకు వెళ్లడం ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆయన ఇక్కడున్నా .. ఏపీలో ఉండరని, లోటస్ పాండే కావాలని విమర్శించారు.మరి బాబు విమర్శలతో జగన్ టూర్ ఆపారా అనే అనుమానం కూడా కలుగుతోంది.