10వ తేదీన జగన్ తొలి మంత్రివర్గ సమావేశం?

10వ తేదీన జగన్ తొలి మంత్రివర్గ సమావేశం?

0
83

ఏపీలో అధికారంలోకి వచ్చి మంచి జోష్‌ మీదున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంత్రి వర్గం ఏర్పాటు చేసిన వెంటనే సమావేశం అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 8వ తేదీన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని, ముందురోజు జరిగే సీఎల్పీ సమావేశంలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఎనిమిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే 10వ తేదీన కేబినెట్‌ తొలిభేటీ కావాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.

మరోవైపు ఈనెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందువల్ల10వ తేదీన కేబినెట్‌ సమావేశం నిర్వహించి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సహచరులతో సీఎం జగన్‌ చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడం, ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామన్న ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.