సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రీతిన కామెంట్లు పెడుతుంటారు కొందరు అసలు ఆ వార్త నిజమా కాదా అనేది కూడా కొందరు చూడరు, అయితే తాజాగా ఓ వార్త ఏపీలో వైరల్ అవుతోంది, ఏపీ సీఎం జగన్
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఉంటున్నారు.
అయితే ఈ ప్రాంతం రెడ్ జోన్ లో ఉందంటూ అనేక వార్తలు వచ్చాయి, రెండు రోజులుగా ఈ వార్తని వైరల్ చేస్తున్నారు, దీనికి కారణం తాడేపల్లి పాత గేట్ సమీపంలో ఉన్న మారుతి అపార్టుమెంటులో ఓ వృద్ధురాలు చనిపోయారు. విజయవాడలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. చనిపోయిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా… కరోనా పాజిటివ్ అని తేలింది.
అయితే అక్కడ నుంచి ఇక అది రెడ్ జోన్ అని ప్రచారం మొదలైంది, ఇక జగన్ నివాసం దగ్గర కూడా రెడ్ జోన్ అంటూ ప్రచారం చేశారు… దీనిపై క్లారిటీ ఇచ్చారు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ … సీఎం నివాసం రెడ్ జోన్ లో ఉందనే వార్తలను ఖండించారు. నాలుగు పాజిటివ్ కేసులున్న ప్రాంతం మాత్రమే రెడ్ జోన్ లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఇక్కడ ఒక్క కేసు మాత్రమే నమోదు అయిందని తెలిపారు.