జగన్ నిర్ణయం పై మంత్రి సంచలన వ్యాఖ్యలు

జగన్ నిర్ణయం పై మంత్రి సంచలన వ్యాఖ్యలు

0
84

ఏపీలో ప్రభుత్వ స్కూల్లో తెలుగుకు బదులు ఇంగ్లీష్ లో బోధన ఉంటుంది అని చెప్పారు జగన్.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాము అని చెప్పగానే తెలుగుకి ఏదో అన్యాయం జరుగుతుంది అనేలా ఏపీలో రాజకీయ నేతలు విమర్శలు చేశారు… ప్రతిపక్షం అగ్గిమీద గుగ్గిలం అయింది. పవన్ విమర్శలు చేశారు, కన్నా లక్ష్మీనారాయణ మతం రంగు పులిమారు. ఇలా అనేక విమర్శలు జగన్ పై వచ్చాయి. అయినా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాము అనుకున్నది చేసి తీరుతాం అన్నారు, తెలుగు కచ్చితంగా బోధన ఉంటూనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం అన్నారు.

అయితే మెజారిటీ సభ్యులు ఇది మంచి నిర్ణయం అని చెబుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దీనిని మంచి నిర్ణయం అని తెలియచేశారు..ఇంగ్లీషు రాకపోతే కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో నేనే ఒక ఉదాహరణ…ఎందుకంటే నేను కూడా 10వ తరగతి వరకూ తెలుగు మీడియంలో చదివా.. ఇంటర్లో ఇంగ్లీషు మీడియంలో చేరిన మూడు నెలల తర్వాత.. మళ్లీ తెలుగు మీడియంలో చేరి ఇంటర్ పూర్తిచేశా. డిగ్రీలో మరలా ఇంగ్లీషు మీడియంలో చేరాను. కానీ ఆంగ్లంపై పట్టుసాధించలేకపోయా. ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అని ఆమె తెలియచేశారు. దీంతో నేరుగా మంత్రి ఈ మాట అనడంతో అందరికి ఆశ్చర్యం కలిగింది అయితే ఇలాంటి నిర్ణయం జగన్ తీసుకోవడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.