జగన్ పాలనకు 100కి 101 మార్కులు వేసిన ప్రముఖ నటుడు

జగన్ పాలనకు 100కి 101 మార్కులు వేసిన ప్రముఖ నటుడు

0
97

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇండస్ట్రీ సపోర్ట్ చాలా తక్కువగా ఉంది… అందుకే ఇటీవలే ఎస్వీబీజే చైర్మన్ పృథ్వీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు… ఏపీకి జగన్ సీఎం అవ్వడం ఎవ్వరికి ఇష్టం లేదని ఓ ప్రముఖ ఛానల్ లో తెలిపారు…

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వైసీపీకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ పుష్కలంగా లభిస్తుంది… మొన్న చిరంజీవి నిన్న వీవీ వినాయక్ లు జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే… తాజాగా మరో నటుడు జగన్ ప్రభుత్వంపై ప్రశంశలు కురిపించారు… నటుడు ఆర్ నారాయణ మూర్తి జగన్ పాలన అద్బుతంగా ఉందని అన్నారు…

స్వాతంత్రం వచ్చిన తర్వాతా నుంచి ఇంతలా ఎవ్వరు అభివృద్ది చేయలేదని అన్నారు… సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల చేత ప్రశంశలు కురిపించుకుంటున్నారని అన్నారు… 54 శాతం ఉన్న బీసీలకు జగన్ రిజర్వేషన్లు కల్పించాలని చూస్తున్నారని అన్నారు..