జగన్ పాలనపై పవన్ తాజా విశ్లేషణ

జగన్ పాలనపై పవన్ తాజా విశ్లేషణ

0
82

కొద్దికాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లా సాగుతున్నాయి ఏపీ రాజకీయాలు…. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే… అయితే ఇదే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరునెలల పాలన ముగిసింది…

ఈ ఆరునెలల పాలన పై పవన్ విశ్లేషణ ఇచ్చారు… ఈమేరకు జగన్ ను ఉద్దేశిస్తు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు… ఆరునెలల పాలనలో విద్వంసం, దుందుకుతనం, కక్ష సాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్చినం ఎక్కువ అయ్యాయని అన్నారు పవన్….

అలాగే కూల్చి వేత పర్యాలు, వరద నీరుతో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలు, కాంట్రాక్టు రద్దులు జరిగాయని పవన్ ఎద్దేవా చేశారు… ఆంగ్ల బోధన అన్న వాదనతో తెలుగు భాషనీ, సంస్కృతిని, బారతీయ సనాతన ధర్మ విచ్చిన్నానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని పవన్ ఆరోపించారు…