మెడలు వంచుతాం, చేతులు వంచుతాం అని, రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్నారని సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ నేత లోకేశ్ వ్యాఖ్యానించారు… ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…
చంద్రబాబు హయంలోనే, పోలవరం ప్రాజెక్ట్ కు 55,648.67 కోట్లు ఆమోదం పొందాయని, కేంద్రమే పార్లమెంట్ వేదికగా చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అసమర్ధత వల్ల, రాష్ట్రానికి 8 వేల కోట్లు నష్టమే కాదు, పోలవరం పవర్ ప్రాజెక్ట్ లో వాటా కూడా కేంద్రం అడుగుతుందని ఎద్దేవా చేశారు…
ఒక పక్క పనులు జరగటం లేదు, కేంద్రం నుంచి చంద్రబాబు హయంలో ఖర్చు పెట్టిన డబ్బులు తెచ్చుకోలేరు, ఇప్పుడు ఏకంగా 8 వేల కోట్లు కోత పెట్టారని మండిపడ్డారు. జగన్ రివర్స్ టెండరింగ్ అంటే ఇదే కాబోలు అని ఎద్దేవా చేశారు