రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి… కానీ ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్ భ్రమల్లో ఉన్నారని మండిపడ్డారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాధిని నియంత్రించడంలో విఫలమయ్యారని నింద వేసేందుకు కాచుక్కూర్చున్నారుని ఆరోపించారు…
కృష్ణానదికి వరదొస్తే కరకట్ట కొంప మునుగుతుందేమోనని రాత్రికి రాత్రి హైదరాబాద్ పారిపోయారు. కరోనా వైరస్ ప్రబలుతుందనగానే పెట్టేబేడా సర్దుకుని ముందే పొరుగు రాష్ట్రం చేరారు. మూడడుగుల దూరం పాటించమంటే మూడొందల కిలోమీటర్లు పారిపోయిన నువ్వు సుద్దులు చెప్పటమేంటీ బాబూ? కర్మ కాకపోతే అని విజయసాయిరెడ్డి అన్నారు..
ఏడాది కింద కరోనా వచ్చిఉంటే చంద్రబాబు నాయుడు పచ్చ మీడియాను వెంటేసుకుని క్వారంటైన్ వార్డుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని ఆరోపించారు. డాక్టర్లను మందలించడం, నేను రాకపోతే పరిస్థితి ఏమిటని నిలదీయడాలు. ఇలాంటి సిఎం మాకు లేడే అని మహారాష్ట్ర, కేరళ ప్రజలు శోకాలు పెట్టినట్టు. ఆ వేషాలు చెప్పనలవి కాకుండా ఉండేవని అన్నారు…