జగన్ పై టీడీపీ మహిళా లీడర్ సంచలన కామెంట్స్

జగన్ పై టీడీపీ మహిళా లీడర్ సంచలన కామెంట్స్

0
81

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పంచుమూర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు… రాజధానిని నాశనం చేసేందుకే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు…

తాజాగా పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… రాజధాని అంశంలో కులాల ప్రస్తావన తీసుకువస్తున్నారని అనురాధ మండిపడ్డారు… ప్రస్తుతం జగన్ మోహన్రెడ్డి పిచ్చి పీక్స్ చేరుకుందని చెప్పడానికి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం అని అన్నారు…

వైసీపీ సర్కార్ కు కుల రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ది అవసరం లేదని అనురాధ విమర్శించారు… అమరావతి ప్రాంతంలో 14 కులాలకు చెందిన వారు ఉన్నారని వారిలో రెడ్ల శాతం 17 అని కమ్మల శాతం 14 ఉన్నారని ఆమె పేర్కొంది…