జగన్ పోలవరం అప్పటికి పూర్తి చేస్తారట టార్గెట్ పెట్టుకున్నారు

జగన్ పోలవరం అప్పటికి పూర్తి చేస్తారట టార్గెట్ పెట్టుకున్నారు

0
95

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లనున్నారు ఈనెల 27న… అయితే ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే పనిలో ఉన్నారు.. అలాగే వేగవంతంగా పనులు చేయిస్తున్నారు.. స్పిల్ వే నిర్మాణం సాగుతోంది, ఇక ఫ్రిబ్రవరి నుంచి జూన్ నెల వరకూ వేగంగా పనులు పూర్తి చేయాలి.

దీని తర్వాత వర్షాలు కాబట్టి అక్కడ పోలవరం పనులు వేగంగా జరగవు.. అందుకే సీఎం జగన్ కూడా వేగంగా ఈ పనులు పూర్తి చేయాలి అని అధికారులకు మంత్రికి తెలిపారు. ఇక ఇక్కడ వచ్చే ఏడాది ఆగస్టు కల్లా పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి అని భావిస్తున్నారు సీఎం జగన్..

గత ప్రభుత్వం చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు.. ఐదేళ్లు చాలా తాత్సారం చేశారు.. కాని తమ పాలన అలాంటిది కాదు అని నిరూపించాలి అని సీఎం జగన్ భావిస్తున్నారు.. అందుకు అనుగుణంగా సీఎం జగన్ తాజాగా పోలవరం పర్యటన చేసి జరుగుతున్న పనులు పరిశీలించనున్నారు.. అక్కడ అధికారులతో ఈ ప్రాజెక్ట్ పనుల గురించి చర్చించనున్నారట.