సోనియా లేఖ పై జగన్ ఏం చేయబోతున్నారో తెలుసా?

సోనియా లేఖ పై జగన్ ఏం చేయబోతున్నారో తెలుసా?

0
47

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తృతీయ కూటమికి మద్దతు ఇస్తారా, బీజేపీ లేదా కాంగ్రెస్ ఎవరికి ఆయన మద్దతు ఇవ్వనున్నారు అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. ఆయన సపోర్ట్ ఇటు మూడు పార్టీలు కోరుకుంటున్నాయి.. ఎవరికి వారు మద్దతు కావాలి అని కోరుతున్నారు.. కాని జగన్ మాత్రం ఓ కీలక నిర్ణయం ఇంటర్నల్ గా తీసుకున్నారు.. ముఖ్యంగా ఆయన పాదయాత్ర ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు, ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తారో వారికే తాను మద్దతు ఇస్తాను అని చెప్పారు.

ఇక ఇప్పుడు రాహుల్ ని ప్రధానిని చేయడానికి సోనియా ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే ఆమె ఇటు తటస్ద పార్టీలు, యూపీఏకి గతంలో సపోర్ట్ చేసిన వారు, కాంగ్రెస్ పక్షాలతో ఆమె భేటీ కావాలి అని చూస్తున్నారు, అందుకే కేసీఆర్ జగన్ చంద్రబాబుకి లేఖలు రాశారు. మే 23 న భేటీ పెట్టనున్నారు, అయితే దీనికి జగన్ లేఖ రావడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయం చర్చకు వస్తోంది, జగన్ తో మంతనాలు జరపాలి అని కాంగ్రెస్ నేతలను కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంత కోరినా జగన్ మద్దతు ఇచ్చేది లేదు అని తెలుస్తోంది.. కాంగ్రెస్ తో కలిసి జగన్ ముందుకు వెళ్లే ఆస్కారం లేదు అని కొందరు పార్టీ నేతలు అంటున్నారు.. అంతేకాదు జగన్ సోనియా భేటీకి కూడా వెళ్లే అవకాశం లేదట.