ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైల్ పై ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. ఇటీవలే వారి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆ ఫైలును గవర్నర్ బిశ్వభూషణ్ కు పంపగా ఇవాళ ఆమోదం లభించింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానుండగా..ఇవాళ రిటైర్ అయ్యే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. గవర్నర్ ఆమోదముద్ర కావడంతో దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సాయంత్రం గెజిట్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ఇక దీనిపై రిటైర్ కాబోయే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి ముందు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పీఆర్సీ పై జగన్ సర్కార్ ఎట్టకేలకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 23.29 శాతం ఫిట్మెంట్ ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసింది. ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పిఆర్సి పై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. పాత పీఆర్సీని అమలు చేయాలని ఏపీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.