జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్

జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్

0
85

తాను పెట్టాననే అక్కసుతో డ్వాక్రా సంఘాలను వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు… డ్వాక్రా సంఘాలకు పార్టీలు వుండవని తెలిపారు… వెలుగు విఓఏలకు రాజకీయాలు తెలియవని చంద్రబాబు అన్నారు.

పేదరికం నుంచి విముక్తం చేసేందుకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు వాళ్ళను తెచ్చామని గుర్తు చేశారు.. తన ముద్ర తొలగించాలనే కక్షతో 28 వేల మంది విఓఏలను తొలగించి, వారి స్థానంలో వైసీపీ కార్యకర్తలను నియమించాలని చూడడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు…

ఇది అమానుషం అని అన్నారు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటానికి తెలుగుదేశం అండగా ఉంటుంది, బాధితులందరికీ భరోసా ఇస్తుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు…