ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ తీపి కబురు..ఆ పథకంపై కీలక ఉత్తర్వులు జారీ..

Jagan Sarkar's sweet talk to AP people .. Key orders issued on the scheme ..

0
80

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.35 వేల అదనపు రుణం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల నుంచి ఈ అదనపు రుణం పొందవచ్చని, దీనికి గాను బ్యాంకులు కేవలం 3 వడ్డీని మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా జగనన్న ‘సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ మెంట్)’ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. రేపు (డిసెంబర్‌21) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.