ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు..పీఆర్సీపై కీలక ప్రకటన

Jagan Sarkar sweet talk to employees

0
91

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. శుక్రవారం తిరుపతిలోని సరస్వతి నగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్‌ను ఉద్యోగులు కలిశారు. పీఆర్సీ గురించి జగన్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్పందించి పీఆర్సీ పూర్తయిందని, వారం రోజుల్లోగా ప్రకటిస్తామని తెలిపారని ఉద్యోగ ప్రతినిధులు తెలిపారు.

దీంతో ఉద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పినట్లయింది. అయితే భవిషత్తు కార్యచరణపై సీఎం సమీర్‌ శర్మకు ఇప్పటికే నోటీసులు సైతం అందించారు. పీఆర్‌సీ పై వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించినట్లయితే ఉద్యమం బాటపడతామని హెచ్చరించాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ ప్రకటన చేశారు.

కాగా కాసేప‌ట్లో నెల్లూరు జిల్లా చేరుకోనున్న జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి మాట్లాడ‌నున్నారు. ఇప్ప‌టికే క‌డ‌ప‌, చిత్తూరులో ఆయ‌న అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి, అన్ని ర‌కాలుగా ఆదుకుంటామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. స‌హాయ‌క చ‌ర్య‌లు స‌మ‌ర్థంగా చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.