జగన్ షాక్ తెరపై మరో కొత్త వాదన

జగన్ షాక్ తెరపై మరో కొత్త వాదన

0
88

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకట చేసిన సంగతి తెలిసిందే… ఈ ప్రకటన వెలువడిన నాటినుంచి తెరపైకి సరికొత్త వాదనలు వస్తున్నాయి… ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా కొత్త వాదనులు వస్తున్నాయి…

శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం సీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు… ఈ నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు…. మూడు రాజధానులు ఏర్పాటు చేయడంలో భాగంగా అనంతపురం జిల్లాలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిద్దారెడ్డి అన్నారు….

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… లక్ష కోట్లు పెట్టి రాజధాని అభివృద్ది చేసే కంటే 3 రాజధానులు ఏర్పాటు చేస్తే ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని అన్నారు… తమ జిల్లాలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తే అభివృద్ది చెందుతుందని అన్నారు…