ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనతో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.. అలాగే పార్టీ తరపున సీనియర్లకు జూనియర్లకు పదువులు ఇస్తున్నారు ..అంతా బాగానే ఉంది. కాని టీడీపీకి జనసేనకు ఓ విషయంలో మాత్రం అవకాశం ఇస్తున్నారు అని తీవ్ర స్ధాయిలో విమర్శలు వస్తున్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ధనాన్ని అనేక విధాలుగా పొదుపు చేస్తూ వస్తున్నారు. కాని ఆయన ఇంటికి కూడా ప్రజాధనాన్ని బీభత్సంగా వాడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.. తాజాగా తాడేపల్లిలో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆరు జీవోలను రద్దు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ లోటస్ పాండ్ సెక్యూరిటీకి సంబంధించిన జీవోను కూడా జగన్ రద్దు చేశారు.
దీంతో ఇప్పటి వరకూ తీవ్రస్ధాయిలో విమర్శలు చేసిన తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు..తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్ నివాసానికి, క్యాంపు కార్యాలయానికి సంబంధించిన విద్యుత్, ఫర్నీచర్, ఇతరత్రా పనులకు కేటాయించిన రూ. 3కోట్ల నిధుల తాలూకు జీవోలను నిలిపేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా ఆయనకు ప్రశంసలు వస్తున్నాయి.