జగన్ మూడేళ్ల సీఎంగా మిగిలిపోతారా….

జగన్ మూడేళ్ల సీఎంగా మిగిలిపోతారా....

0
88

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల సీఎంగా మిగిలిపోతారా అంటే అవుననే అంటున్నారు సీపీఐ జాతీయ నాయకులు నారాయణ… తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

జగన్ మోహన్ రెడ్డి 30 ఏళ్ల సీఎం కాదని మూడేళ్ల సీఎం అని వ్యాఖ్యానించారు నారాయణ… ఇటీవలే జగన్ అసెంబ్లీ సాక్షిగా ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు… ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి విజయవాడలో చేపట్టిన ఆందోళనకు నారాయణ మద్దతు తెలిపారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ… తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారని మండిపడ్డారు.. ఆంధ్రా వాళ్ల కోసం కాదని తెలిపారు… మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాద్ లో రియల్ ఎస్టెట్ వ్యాపారం పుంజుకుందని అన్నారు…