జగన్ విశాఖ పై మరో కీలక నిర్ణయం

జగన్ విశాఖ పై మరో కీలక నిర్ణయం

0
80

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పరిపాలతో ప్రజలకు మరింత దగ్గర అయ్యారు, తన పరిపాలనలో సంక్షేమ పథకాలలో మార్క్ చూపిస్తున్నారు.. అయితే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం అని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని కోరుతున్నారు. కాని ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం పై వెనక్కి తగ్గేలా లేదు.

ఇలా రాజధాని ప్రాంతంలో గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, త్వరలోనే సచివాలయాన్ని విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది అన్ని డిపార్ట్ మెంట్ల హెడ్స్ ఇప్పటికే సిద్దం అవుతున్నారట.

అలాగే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం వస్తోంది. అయితే దీని కోసం ముహూర్తం కూడా పెట్టారు అనే వార్త వినిపిస్తోంది. ఏప్రిల్ 6 వ తేదీలోగా సచివాలయ తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారన్న ప్రచారం నడుస్తోంది. అయితే కమిటి నివేదిక వచ్చినా ముఖ్యమంత్రి నిర్ణయం ఫైనల్ కాబట్టి సీఎం జగన్ నిర్ణయం ప్రకారం విశాఖనే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని అంటున్నారు. ఇక ఫ్రిబ్రవరిలో ఉత్తర్వులు విడుదల చేయనుందట ఏపీ సర్కార్.