రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన పాలన మీ సూచన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాటినుంచి ఎన్నికల ప్రచార సందర్భంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిన విస్మరించకుండా అభివృద్ది సంక్షేమ పథకాలతో పాలనను కొనసాగించిన తీరు నభూతో నభవిషత్ అని చెప్పుకోవచ్చు….
ఈనెల 29 తో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికానుంది… అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఏఒక్క సంక్షేమ పథకాన్ని మరువకుండా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే చెల్లుతుంది… అంతేకాదు ప్రజల నుంచి కూడా జగన్ పాలనపై అనూహ్య స్పందన వస్తుంది…
ఏడాది పాలకు ప్రజలకు జగన్ కు వందకు 90 మార్కులు వేస్తున్నారు… ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ కార్యక్రమాన్ని నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయని అంటున్నారు… అలాగే వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తు వారికి అవగాహణ కల్పిస్తున్నారని తెలుపుతున్నారు…