ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తీసుకున్న నిర్ణయం కొందరు స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.. ఇక ఈ రాజధాని విషయంలో ముందు నుంచి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ రాజధానిపై వ్యతిరేకంగానే ఉన్నారు, అసలు అమరావతి రాజదాని కొందరి కోసమే అని విమర్శలు చేశారు.
ఎవరి రాజధాని అమరావతి? అంటూ ఆయన విమర్శనాత్మకంగా ఓ పుస్తకం కూడా రాశారు. తాజాగా, ఏపీ రాజధాని విశాఖకు తరలిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో స్పందించారు. ఏపీలో ఎక్కడ చూసుకున్నా విశాఖను మించిన మరో ప్లేస్ లేదు అని విశాఖ అయితే రాజధానికి బెటర్ అని తెలిపారు ఆయన.
హైదరాబాద్, ముంబయి వంటి నగరాల స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందాలంటే మరో రెండు మూడు తరాల వరకు అవకాశమే లేదని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో విశాఖని సెలక్ట్ చేసుకుంటే సులువుగా దానిని డవలప్ చేయవచ్చు అని చాలా వరకూ విశాఖలో అన్నీ సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలియచేశారు. కర్నూలుకు హైకోర్టు వస్తే అక్కడ కూడా డవలప్ మెంట్ జరుగుతుంది అని తెలిపారు ఆయన.