జగన్ ని జైలుకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

జగన్ ని జైలుకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

0
72

తాజాగా ఏపీలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం చర్చకు వచ్చింది.. దీనిపై విచారణ సాగుతోంది, దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారని, టీడీపీ నేతల రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయని ట్వీట్ చేశారు, దీనికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

పాత తప్పులు,ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైజాగ్ లో చేస్తున్న భూముల దందా అంతా బయటపడుతుంది మీరు, మీ పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయం సాయి రెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.

వైయస్ జగన్ గారూ, మీ వైకాపా బ్యాచ్ ప్రకారం మీరు పెద్ద తెలుగుపండితులు కదా, స్క్రిప్ట్ చదువుతూ తెలుగుకి తెగులు పట్టించడం ఏంటండీ? విజయసాయిరెడ్డిగారు ఇదంతా మీ ట్రైనింగే కదా ..హహ పేటీఎం బ్యాచ్ మీ అన్నకోసం ఇక కవరింగ్ మొదలెట్టండి అంటూ వీడియోని ట్వీట్ చేశారు.

అడ్డమైన పనులు చేసి 16 నెలలు చిప్ప కూడు తిన్న నీకు మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి అనే అంత ధైర్యం వచ్చిందా ? అంత వరకూ వచ్చాకా మేము మాత్రం చూస్తూ కూర్చుంటామా? మిమల్ని,మీ జగన్ గారిని మళ్లీ జైలుకు పంపేదుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రెడీ గా ఉండండి అంటూ ట్వీట్ చేశారు బుద్దా వెంకన్న.