ఈ జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ

ఈ జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ

0
175

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 175 అసెంబ్లీ స్ధానాల్లో 151 గెలుచుకుంది.. 24 స్ధానాలు జనసేన టీడీపీ గెలుచుకున్నాయి.. అయితే మొత్తానికి జగన్ అనుకున్నది సాధించి అధికారంలోకి వచ్చారు.. ఈ సమయంలో అసంత్రుప్తి జ్వాల రగలకూడదు అనే విషయంలో జగన్ కూడా ఆచితూచి అడుగులునిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీ తరపున.

ముఖ్యంగా కొత్తగా పార్టీలో ఎవరిని అయినా చేర్చుకుంటే, వారు కలిసి పనిచేస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది.. అందుకే ముందు పార్టీలో నేతలతో విభేదాలు లేని వారితో చర్చించి పార్టీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారు.

తాజాగా వంశీ విషయంలో కూడా ముందుగానే అన్నీ చూసుకుని పార్టీ తరపున వివాదాలు లేకుండా యార్లగడ్డతో చర్చించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆయన వైసీపీలో త్వరలో చేరనున్నారు, అయితే విభేదాలు వర్గపోరులు వస్తే మళ్లీ తెలుగుదేశం పంచాయతీ ఎలా అయిందో, అలా అవుతుంది అని భావిస్తున్నారట వైసీపీ నేతలు.. అందుకే జర జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు సీనియర్లు.