జమ్మలమడుగు టీడీపీలో కొత్త పంచాయతీ

జమ్మలమడుగు టీడీపీలో కొత్త పంచాయతీ

0
87

జమ్మలమడుగులో కేవలం పదవుల కోసమే ఆదినారాయణ రెడ్డి గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు అని అక్కడ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆరోజు పదవి అవసరం కాబట్టి వైసీపీ నుంచి టీడీపీకి చేరి తన పనులు కానిచ్చుకుని, ఇప్పుడు అవసరం లేదని పార్టీనీ వీడి బీజేపీలో చేరారు అని ఆదినారాయణ రెడ్డిని విమర్శిస్తున్నారు, చంద్రబాబు సీనియర్లను, అలాగే పార్టీలో కమిట్ మెంట్ తో పని చేసేవారిని పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు.

గతంలో రామసుబ్బారెడ్డిని వదులుకుని ఆదినారాయణ రెడ్డిని పార్టీలో ఉంచుకుని ఉంటే, ఇప్పుడు పార్టీని నడిపేందుకు ఒక్క నేత కూడా ఉండేవారు కాదు అని గుర్తు చేస్తున్నారు.. తాజాగా ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్లడంతో పాటు, ఆయన కేడర్ ని కూడా బీజేపీలోకి తీసుకువెళ్లారు. అయితే జగన్ ని ఓడిస్తా సీఎం అవ్వనివ్వను అని విమర్శలు చేసిన ఆదినారాయణ రెడ్డి, చివరకు పార్టీ మారిపోయారు.. సో చంద్రబాబు పార్టీ అధినేతగా కేవలం తెలుగుదేశం పార్టీ కేడర్ ని పార్టీ నేతలని చూడాలని, పార్టీ ఫిరాయించిన నేతలని కాదు అని అక్కడ టీడీపీ నేతలు బాబుకి చెబుతున్నారు.. మొత్తానికి చివరకు రామసుబ్బారెడ్డే అక్కడ టీడీపీకి పెద్ద దిక్కు అయ్యారు ఇప్పుడు.