ఝార్ఖండ్ లో బీజేపీకి మరో షాక్

ఝార్ఖండ్ లో బీజేపీకి మరో షాక్

0
87
MLA Raja Singh

విజయాల పరంపర కొనసాగిస్తున్న బీజేపీకి మరో ఐదో స్టేట్ చేజారిపోయింది.. తాజాగా జరిగిన
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని దూరం చేసుకుంది…కాంగ్రెస్ – జేఎంఎం కూటమి అధికారంలోకి వచ్చింది. నిజంగా ఇది బీజేపీకి షాక్ అనే చెప్పాలి, పొత్తులు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం కూడా ఈ ఓటమికి కారణం అనే చెప్పాలి.

ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయన్న విషయాన్ని జాతీయ ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్ సైట్లో వెల్లడించింది. అయితే గెలిచిన పార్టీ కంటే బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి సీట్లు తక్కువ వచ్చాయి. పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాలను పరిశీలిస్తే..

బీజేపీ – 33.37 శాతం,
జేఎంఎం – 18.75 శాతం
కాంగ్రెస్ 13.88 శాతం,
ఏజేఎస్యూపీ – 8.10 శాతం,
జేవీఎం – 5.45 శాతం,
ఆర్జేడీ – 2.75 శాతం
నోటాకు 1.36 శాతం ఓట్లు లభించగా,

ఇక పొత్తుపెట్టుకుని పోటీ చేసిన. జేఎంఎం, కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లన్నీ కలిపినా కూడా బీజేపీకి వచ్చిన ఓట్లతో సమానం ఏమీ లేదు.