జగన్ క్యాబినెట్ లో జయసుధ కి టీటీడీ..!!

జగన్ క్యాబినెట్ లో జయసుధ కి టీటీడీ..!!

0
114

ఇప్పుడు వైసీపీలో నామినేటెడ్ పోస్ట్ ల కోసం పోటీ నెలకొంది. టీడీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌‌గా చేసిన అంబికా క్రిష్ణ ఇటీవల రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిపై చాలా మంది సినీ ప్రముఖుల దృష్టి పడింది. ముఖ్యంగా మోహన్ బాబు, జీవిత, ఆలీ వంటి సినీ ప్రముఖులు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ రేసులో ఉన్నారు. అయితే జగన్ ఈ పదవికి ఎవరైతే సరిపోతారో ఆచి తూచి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పదవిపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. ఈ పదవి కోసం వినిపిస్తున్న మొదటి పేరు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి. తన రాజంపేట ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినందుకు గాను ఆయనకు ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు మోహన్ బాబు,జయసుధ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. అయితే జగన్ జయసుధ వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.. ఏవైనా రాజకీయ సమీకరణలు మారితే తప్ప జయసుధ కి ఈ పదవి ఖాయం అనేది వైసీపీ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. అంతేకాదు ఈసారి టీటీడీ పాలకమండలిలో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేతలకు చోటు దక్కుతుందని అంటున్నారు.