ఆ కారణంతోనే చంద్రబాబును కలిసిన జయసుధ…. వైసీపీలో వేడెక్కిన వాతావరణం

ఆ కారణంతోనే చంద్రబాబును కలిసిన జయసుధ.... వైసీపీలో వేడెక్కిన వాతావరణం

0
117

ఈ నెల 26న జయసుధ కుమారుడు నీహార్ వివాహానికి చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. జయసుధ చెల్లెలు సుభాషిని చంద్రబాబును వివాహానికి ఆహ్వానించారు. ఢిల్లీకి చెందిన అమ్రీన్ కౌర్ తో వివాహం జరుగుతుంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న జయసుధ అనంతరం చంద్రబాబు సీఎం అయిన తర్వాత టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల కంటే ముందు తిరిగి వైసీపీలో చేరి మ‌హిళా నాయ‌కురాలుగా పార్టీకి సేవ‌లు అందిస్తున్నారు. అయినా కూడా చంద్రబాబు మీద ఉన్న గౌరవంతో తన కుమారుడి పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని జయసుధ బాబును కోరారు.

అస‌లే ప్ర‌స్తుతం వైసీపీ, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య ప‌చ్చి గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఇలాంటి స‌మ‌యంలో జ‌య‌సుధ కుమారుడి పెళ్లికి చంద్ర‌బాబు, అనుచ‌రులు వెళుతారా.. వెళితే అక్క‌డి వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో అన్న ఆశ‌క్తి అందిలోనూ ఉంది.