చంద్రబాబుతో భేటీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జయసుధ

చంద్రబాబుతో భేటీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జయసుధ

0
151

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళానాయకురాలు, ప్రముఖ నటి ,మాజీ ఎమ్మెల్యే, జయసుద, టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుని కలిశారు..నటి జయసుధ, తన సోదరి సుభాషిణితో కలిసి చంద్రబాబునాయుడి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. తన కుమారుడు నిహార్ కపూర్ వివాహం నిశ్చయమైందని, పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆమె కోరారు.

దీంతో చంద్రబాబు కూడా చాలా సంతోషంగా ఆమెతో మాట్లాడారు, తప్పకుండా హజరు అవుతాము అని తెలిపారు…ఫిబ్రవరి 26న నిహార్ వివాహం న్యూఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్ తో జరగనుందట… జయసుధ భర్త నితిన్ కపూర్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె రాజకీయాల్లో గతంలో చాలా యాక్టీవ్ గా ఉన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. తర్వాత టీడీపీలో చేరారు, కొద్ది కాలం టీడీపీలో ఉండి .2019 ఎన్నికల ముందు జయసుధ వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.