జేసీ బ్రదర్స్ ను టార్గెట్ చేసిన ఆ వైసీపీ ఎమ్మెల్యే…

జేసీ బ్రదర్స్ ను టార్గెట్ చేసిన ఆ వైసీపీ ఎమ్మెల్యే...

0
93

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జైసీ దివాకర్ రెడ్డిపై అధికార వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు… తనపై వస్తున్న ఆరోపణలపై జేసీబ్రదర్స్ బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జేసీ బ్రదర్స్ ఓటమి తర్వాత తాడిపత్రిలో ప్రజా పాలన సాగుతుందని అన్నారు… ప్రజలందరు సంతోషంగా ఉన్నారని కేతిరెడ్డి అన్నారు… సర్కార్ ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు…

తాడిపత్రిలో మట్కానిర్విచినది జేసీ సోదరులే అని ఆయన ఆరోపించారు… అక్రమంగా వీరు వందల కోట్ల రూపాలయాలు సంపాదించుకున్నారని ఆరోపించారు… వారు ఆడబ్బులను ఎలా సంపాదించారో చెప్పాలని పెద్దారెడ్డి ప్రశ్నించారు… గ్రామాల్లో కక్ష ముఠాలను పెంచేందుకు జేసీ బ్రదర్స్ కుట్రలకు పడుతున్నారని ఆరోపించారు..