బీజేపీలో చేరికపై జేసీ క్లారిటీ

బీజేపీలో చేరికపై జేసీ క్లారిటీ

0
79

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో క్రమ క్రమంగా పార్టీలోని సభ్యుల సంఖ్య తగ్గుతోంది… తమ రాజకీయ భవిష్యత్ దృష్ట్య తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… ఇప్పటికే గుడివాటి టీడీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వైసీపీలో చేరగా…

తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాను కూడా వైసీపీలో చేరుతానని ప్రకటించారు… ఇక ఇదే క్రమంలో మరికొందరు నేతలు వైసీపీలో చేరుతారని వార్తలు వస్తుండటంతో టీడీపీలో కలవరం పెడుతోంది. ఈ క్రమంలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వరుసగా మోదీని పొగుడుతున్నారు…

దీంతో ఆయన కూడా బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి… అయితే దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు… తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని మోదీ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి తాను వాటిని మొచ్చుకుంటున్నానని తెలిపారు జేసీ