చంద్రబాబుపై జేసీ అదిరిపోయే కౌంటర్

చంద్రబాబుపై జేసీ అదిరిపోయే కౌంటర్

0
123

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మారడంపై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసే వారందరు కేసులు భరించలేక వెళ్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ అలాగే చంద్రబాబు నాయుడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు..రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ఎలాంటి హామీలు అయినా ఇస్తాయని అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూడా 100 కు పై గా హామీలు ఇచ్చారని అన్నారు…

అలాగే జగన్ కూడా నవరత్నాలు ప్రకటించారని అన్నారు… ప్రాంతీయ పార్టీల ఉన్నంతవరకు రాష్ట్రాలు భాగుపడవని అన్నారు… ఎళ్లవెళలా తామే ముఖ్యమంత్రిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలకు అనేక హామీలను ఇస్తారని అన్నారు… ఈ విషయంపై తాను గతంలో చంద్రబాబు నాయుడును కూడా ప్రశ్నించానని అన్నారు..