జేసీకి.. తాడిపత్రి ఎమ్మెల్యే కుమారుడికి బిగ్ ఫైట్…

జేసీకి.. తాడిపత్రి ఎమ్మెల్యే కుమారుడికి బిగ్ ఫైట్...

0
107

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… తాజాగా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలోకి జేసీ దివాకర్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్ రెడ్డిల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది…

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలోకి జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు.. అంతకుముందే హర్షవర్దన్ రెడ్డి కార్యాలయంలోకి వెళ్లారు దీంతో పోలీసులు జేసీని అడ్డుకున్నారు… హర్ష వర్దన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత పంపిస్తామని చెప్పారు.. ఈ క్రమంలోనే అక్కడే జేసీ, హర్షవర్దన్ వాగ్వావాదానికి దిగారు…

ఇరు వర్గాల మధ్య వాగ్వావాదం పెరగడంతో పోలీసులు వారిని అక్కడ నుంచి పంపించేశారు… కాగా నిన్న హర్షవర్దన్ రెడ్డి తాడిపత్రి మున్సిపాల్టీలోని 30వ వార్డుకు కౌన్సిల్ గా నామినేషన్ వేశారు… అదే వార్డుకు జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు… ఇక్కడ వీరిద్దరు పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది…