జేసీ కుటుంబం వస్తే జగన్ ఏం చేస్తారు

జేసీ కుటుంబం వస్తే జగన్ ఏం చేస్తారు

0
92

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ రాజకీయాలు తెలిసినవే, అయితే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ కూడా రాజకీయంగా ఈసారి తప్పుకుని తమ వారసులని ఎన్నికల్లో బరిలోకి దింపారు.. ఇటు పవన్ రెడ్డి అటు అస్మిత్ రెడ్డి ఇద్దరూ కూడా ఓటమి పాలయ్యారు.. అయితే జేసీ వారసులు ఇప్పుడు వైసీపీలోకి వస్తారు అని వార్తలు వస్తున్నాయి.. ఎందుకు అంటే జగన్ పై జేసీ వారసులు ఎక్కడా విమర్శలు చేయలేదు.. కేవలం దివాకర్ ప్రభాకర్ రెడ్డి మాత్రమే విమర్శలు చేశారు.

అందుకే వారు కాకుండా తనయులు ఇద్దరూ కూడా వైసీపీలో చేరుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాడిపత్రి అనంతపురంలో వైసీపీ కేడర్ వీరితో కలిసి పనిచేస్తుందా అంటే అనుమానం అని చెప్పాలిందే ..అయితే వైసీపీలో కొందరు చెప్పేదాని ప్రకారం అసలు ఇది వాస్తవం కాదు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ కేడర్ బాగానే ఉంది ఈ విషయంలో జేసీ సోదరులని పార్టీలో చేర్చుకుంటే మరికొన్ని తలనొప్పులు తప్పవు అని, సీఎం జగన్ కూడా ఈ విషయంలో ముందుకు వెళ్లరు అని వార్తలు వస్తున్నాయి.