జేసీ వైసీపీకి భారీ హెచ్చరికలు

జేసీ వైసీపీకి భారీ హెచ్చరికలు

0
84

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందా అంటే అవుననే అంటున్నారు ఆయన…. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. తనను ఆర్ధికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలలు కంటూనే ఉంటారని అన్నారు… అమరావతినుంచి రాజధానిని మారిస్తే రాయలసీమలో మరో ఉద్యమం స్టార్ అవుతుందని హెచ్చరించారు… రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ చేశారు…

రాజధాని నగర నడిబోడ్డున ఉంటే అభివృద్ది చెందుతుందని అన్నారు… 75 ఏళ్లలో వరదలు వచ్చినా అమరావతి మునిగిపోయింది లేదని అన్నారు…. సర్కార్ నాయకులు అగ్గిరాజేస్తే మంటలు రావడం ఖాయం అని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు…