ఉద్యోగులకు భారీషాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.

ఉద్యోగులకు భారీషాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.

0
91

ఈ వైర‌స్ తో పూర్తిగా రెండు నెల‌లు దేశం లాక్ డౌన్ లో ఉంది, ఈ స‌మ‌యంలో ఎవ‌రికి ఆదాయం లేదు వ్యాపారాలు లేవు ఇక ప్ర‌భుత్వాల‌కి ట్యాక్సులు లేవు, చాలా మంది ఆర్దికంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు, అయితే తాజాగా జీతాలు ఇవ్వ‌ని స్టేట్స్ కూడా ఉన్నాయి ఉద్యోగుల‌కి, వారికి 50 శాతం అర‌వై శాతం మాత్ర‌మే జీతాలు ఇచ్చారు.

ఇక సాధార‌ణ ప‌రిపాల‌న ఆదాయం వ‌చ్చిన త‌ర్వాత స‌ర్దుకున్నాక ఆ జీతాలు చెల్లించ‌నున్నారు, ఈ స‌మ‌యంలో కేంద్రం ద‌గ్గర కూడా నిధుల కొర‌త ఉంది, ఈ స‌మ‌యంలో ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంక్రిమెంట్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే ఏడాది వరకూ శాలరీ ఇంక్రిమెంట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఒక ఆర్డర్ కూడా జారీ చేసింది. దీంతో కేంద్రంలో కొలువు చేస్తున్న వారికి వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ శాల‌రీ పెంపు ఉండ‌దు, ఈ లాక్ డౌన్ వ‌ల్ల వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వ‌ర‌కూ ఉద్యోగులు వేచి ఉండాల్సిందే.