కాంగ్రెస్ లో జోష్..రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి కలయిక

Josh in Congress .. Rewanth Reddy Komatireddy combination

0
122

తెలంగాణ కాంగ్రెస్ లో​ ఆ ఇద్దరు కీలక నేతలు. ఒకరంటే మరొకరికి పడదు. వారు ఇరువురు కలిసినా కూడా మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువే. ఆ ఇద్దరు కూడా ఒకే పదవి కోసం ప్రయత్నించగా..ఒకరికే ఆ పదవి దక్కింది. ఆ ఇద్దరు ఎవరని అనుకుంటున్నారా..ఇంకెవరో కాదు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిలు.

ఇప్పుడు ఈ ఇద్దరి గురించి చర్చించే అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా? ఇన్ని రోజులు ఒకే పార్టీలో వుంటూ ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ నేతలు అనూహ్యంగా భేటీ అయ్యారు. ఇది వారికి తొలి భేటీ కాగా ఈ భేటీలో ప్రముఖంగా ఏం చర్చించారనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలిచి వేస్తున్న ప్రశ్న.

హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసం వీరి భేటీకి వేదిక అయింది. అయితే ఇంటికి వచ్చిన రేవంత్‌రెడ్డికి వెంకట్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ భేటీలో తాజా రాజాకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. అంతేకాదు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కలిసి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలకు ఓరిగిందేమి లేదని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్‌కు కేటీఆర్‌ చొరవ చూపాలని సూచించారు. ఆ తర్వాత 3 రోజులు కాకుంటే వారం వేడుకలు జరుపుకున్న అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు వెల్లడించారు.

కోమటిరెడ్డితో భేటీకి సంబంధించిన ఫోటోలను రేవంత్‌రెడ్డి.. హ్యాపీ టైమ్స్‌ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కోమటిరెడ్డి సైతం ట్విట్టర్‌లో ఫోటోలు పంచుకున్నారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. తమ భేటీకి సంబంధించిన ఫోటోలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.